NTV Telugu Site icon

Nani: వెన్నెల కనిపించేది ఆరోజే…

Dasara

Dasara

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ఫస్ట్ మల్టీలాంగ్వేజ్ సినిమా ‘దసరా’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మార్చ్ 30న రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ మూవీ టీజర్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని ఆకాశాన్ని తాకేలా చేసింది. నాని లుక్, డైలాగ్స్, టీజర్ లో చూపించిన ఫ్రేమ్స్, సంతోష్ నారాయణ్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్, రా అండ్ రగ్గడ్ సెటప్, ఊర మాస్ అనిపించే రేంజ్ ఎండ్ షాట్… దసరా టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేలా చేశాయి. దసరా టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ తెలుగు నుంచి మరో పాన్ ఇండియా హిట్ రాబోతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే టీజర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

Read Also: Dasara Teaser: ఏయ్.. బాంచత్ .. నాని నట విశ్వరూపం

దసరా రిలీజ్ కి రెండు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇకపై బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ గా నటిస్తుంది కానీ ఆమె టీజర్ లో కనిపించలేదు. కీర్తి సురేష్ దసరా సినిమాలో ‘వెన్నెల’ పాత్రలో నటిస్తోంది. గతంలో కీర్తి సురేష్ పుట్టిన రోజు సంధర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో కీర్తి సురేష్ డీగ్లామర్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. ఒక నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ కి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె దసరా టీజర్ లో కనిపిస్తుందని వెయిట్ చేసిన వారికి షాక్ ఇస్తూ టీజర్ లో నాని విజువల్స్ మాత్రమే పెట్టారు. దీంతో స్వయంగా నానినే ట్వీట్ చేస్తూ “వెన్నెల ట్రైలర్ లో కనిపించనుంది” అంటూ చెప్పేశాడు. మరి కొత్త మేకోవర్ ని చూపించి నాని టీజర్ తో మెప్పించాడు, ఇక ట్రైలర్ తో వెన్నెల ఎలాంటి మేకోవర్ చూపించి షాక్ ఇస్తుందో చూడాలి.

Show comments