యంగ్ హీరో నితిన్ తన భార్య షాలినికి గన్ గురిపెట్టాడు.. వామ్మో ఇటీవలే పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఏమైంది… అని కంగారుపడకండి.. ఇదంతా దీపావళి పండగలో భాగమే.. కరోనా తరువాత అందరు సంతోషంగా కలిసి చేసుకుంటున్న పండగ దీపావళీ. దీంతో సెలబ్రిటీలందరు తమ తమ కుటుంబ సభ్యులతో దీపాలను వెలిగించి, అందరు బావుండాలని పూజలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా నితిన్ వైఫ్ షాలిని తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. “అందరికి హ్యాపీ అండ్ సేఫ్ దీపావళీ.. కానీ నేను మాత్రం సేఫ్ గా లేననిపిస్తోంది” అంటూ పోస్ట్ చేసిన వీడియోలో నితిన్ బొమ్మ తుపాకీతో తన భార్యను భయపెడుతున్నాడు. బొమ్మ పిస్టల్ తో భార్యకు గురిపెట్టి టపటపా అని బాంబులు పేలుస్తున్నాడు. ఆ సౌండ్ కి షాలిని చెవులు మూసుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నితిన్ చిన్నపిల్లాడిలా మారిపోయి దీపావళీని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాడో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ చిత్రంలో నటిస్తున్నాడు.
