Nithya Menen To Tie The Knot With Malayalam Actor Soon: నిత్యా మేనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ స్టార్ హీరోతో! ట్యాలెంటెడ్ నటిగా దక్షిణాది చిత్రసీమలో తనదైన ప్రత్యేక గుర్తింపు సాధించిన నిత్యా.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించిందని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని ఓ ఇంగ్లీష్ డైలీ పేర్కొంది. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా చెలామణి అవుతోన్న ఓ హీరోని పెళ్లాడనుందని సమాచారం.
కొంతకాలం నుంచి వీళ్లిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారని, ఇద్దరి అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారని, కుటుంబ సభ్యులకు సైతం తమ ప్రేమ వ్యవహారం గురించి చెప్పారని తెలిసింది. ఇరువురి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, పెళ్లి ప్రిపరేషన్స్ రహస్యంగా జరుగుతున్నాయని కూడా ఆ డైలీ పేర్కొంది. కానీ, ఆ హీరో ఎవరన్నది రివీల్ చేయలేదు. అయితే, ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, స్వయంగా నిత్యా మేనన్ స్పందించేదాకా వేచి చూడాల్సిందే! గతంలోనూ ఓసారి నిత్యా మేనన్‌పై ఎఫైర్‌కి సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆ తర్వాత తేలింది. మరి, ఇప్పుడొస్తున్న వార్తల సంగతేంటో చూడాలి.
ఇదిలావుండగా.. చివరిసారిగా నిత్యా మేనన్ ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. మోడర్న్ లవ్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించిన ఈ అమ్మడు, తెలుగు ఇండియన్ ఐడల్‌లో జడ్జిగానూ అలరించింది. ‘ఆరామ్ తిరుకాల్పన’ అనే ప్రాజెక్ట్‌కి సంతకం చేసిన నిత్యా మేనన్, మరే ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. మరి, తనపై వస్తోన్న ఈ పెళ్లి వార్తల మీద నిత్యా ఎలా స్పందిస్తుందో చూడాలి.
