NTV Telugu Site icon

Nithya Menen: స్టార్ హీరో నన్ను వేధించాడు.. ఆ ఇండస్ట్రీ వలన ఎన్నో ఇబ్బందులు పడ్డా

Nitya

Nitya

Nithya Menen: టాలెంటెడ్ నటి నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా మొదలైంది సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నిత్యా. మొదటి సినిమాతో భారీ హిట్ ను అందుకొని వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. గ్లామర్, అందాల ఆరబోత లేకుండా స్టార్లు అవలేరని అనుకుంటున్నా జనరేషన్ లో అవేమి లేకుండానే.. స్టార్ హీరోయిన్ గా ఎదిగి అందరి మన్ననలు పొందింది. ఇక తెలుగు లోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి మంచి సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న నిత్యా.. ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటించింది. గోమతేష్ ఉపాధ్యాయే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Amardeep: ఛీ.. అదొక రీజనా.. నోరు అదుపులో పెట్టుకో.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి

ఇక ఈ సిరీస్ ను స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మించడం విశేషం. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం.. వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిత్యామీనన్ .. కోలీవుడ్ హీరో తనను వేధించాడని చెప్పడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ” కోలీవుడ్ స్టార్ హీరో నన్ను వేధించాడు.. తమిళ్ ఇండస్ట్రీ వలన నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను” అని చెప్పింది. దీంతో నిత్యాను వేధించిన ఆ హీరో ఎవరు అంటూ అభిమానులు ఆరాలు తీసుకున్నారు. విజయ్, ధనుష్, సూర్య, రాఘవ లారెన్స్, విక్రమ్ తో నిత్యా నటించింది. మరి ఇందులో ఏ హీరో గురించి నిత్యా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో అనేది తెలియాల్సి ఉంది.

Show comments