Site icon NTV Telugu

Nithiin : విజయ్ దేవరకొండ కోసం త్యాగం చేసిన నితిన్

Nithiin

Nithiin

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు అసలు ఏది కలిసి రావడం లేదని చెప్పాలి. 2020లో వచ్చిన భీష్మ నితిన్ లాస్ట్ హిట్. ఆ తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ వేటికవే ఫ్లోప్స్. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుమలను నమ్మి రాబిన్ హుడ్  పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు నితిన్. కానీ ఈ సినిమా కూడా నితిన్ ను గట్టెక్కించలేదు.

Also Read : Official : విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్ ఇదే

అయిన సరే ఏ మాత్రం నిరుత్సహపడకుండా తన నెక్ట్స్ సినిమాను ప్రకటించాడు నితిన్. ఓ మై ఫ్రెండ్, వకీల్ సాబ్ చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమా చేసాడు. షూటింగ్ ఎప్పుడో ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు అడ్డాకుల ఎదుర్కొంటోంది. మొదట ఈ సినిమాను మే లో రిలీజ్ చేయాలని భావించినప్పటికి వాయిదా వేశారు. లేటెస్ట్ గా జులై 4న తమ్మడు రిలీజ్ చేస్తున్నామని చేస్తున్నామని అధికారకంగా ప్రకటించారు. అందుకోసం దర్శకుడు వేణు బర్త్ డే కనుకగా ఓ ప్రమోషనల్ వీడియోను కూడా రిలీజ్ చేసారు మేకర్స్. తీరా ఇప్పుడు మరోసారి తమ్ముడు రిలీజ్ వాయిదా పడింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ ను జులై 4న రిలీజ్ చేస్తామని తమ్ముడు నిర్మాత దిల్ రాజు కోరగా అందుకు ఆయన ఓకే అనడంతో విజయ్ కోసం నితిన్ త్యాగం చేయాల్సి వచ్చింది. మరి తమ్ముడు న్యూ రిలీజ్ డేట్ ను ఎప్పుడు ప్రకటిస్తారో నితిన్ కు హిట్ ఎప్పుడు వస్తుందో.

Exit mobile version