Nithiin : నాని బ్యానర్‌లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్

Nithiin

Nithiin

టాలీవుడ్‌లో సరికొత్త వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ ‘వాల్‌పోస్టర్ సినిమా’. నేచురల్ స్టార్ నాని నేతృత్వంలోని ఈ బ్యానర్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఈ బ్యానర్ నుండి వచ్చిన ఆ, కోర్ట్ సినిమాలే అందుకు నిదర్శనం. తాజాగా ఈ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ నుండి మరో క్రేజీ ప్రాజెక్ట్ లైన్‌లోకి వచ్చింది.

యువ హీరో నితిన్ హీరోగా, ‘దండోరా’ ఫేమ్ డైరెక్టర్ మురళీ కాంత్ దర్శకత్వంలో వాల్‌పోస్టర్ సినిమా ఒక సరికొత్త సినిమాను ప్లాన్ చేస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో సాగే ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే చర్చలు ముగిశాయని, నాని ఈ స్క్రిప్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల టాక్. డిఫరెంట్ జోనర్స్‌ని ట్రై చేస్తూ సక్సెస్ కోసం చూస్తున్న నితిన్‌కు ఈ సినిమా ఖచ్చితంగా ఒక మేకోవర్ లాంటి కథ అవుతుందని భావిస్తున్నారు. గతంలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌లో వచ్చిన ‘అ!, హిట్ సిరీస్, కోర్ట్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నితిన్ వంటి స్టార్ హీరో ఈ బ్యానర్‌లోకి రావడం దానికి తోడు మురళీ కాంత్ మార్క్ టేకింగ్ తోడవనుండటంతో ఈ ప్రాజెక్ట్‌ సంథింగ్ ఎదో కొత్తగానే తీసుకురాబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. వరుస ప్లాప్స్ తో సతమవుతున్న నితిన్ కు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.