Site icon NTV Telugu

పూజా కార్యక్రమాలతో మొదలైన నిఖిల్ కొత్త సినిమా!

Nikhil's Nikhil19 launched today

యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో 19వ చిత్రాన్ని ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ (‘గూఢచారి, ఎవరు, హిట్’) డైరెక్ట్ చేయబోతున్నాడు. రెడ్ సినిమాస్ ప‌తాకంపై కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ తేజ్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వారి చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందించారు. సినిమా సక్సెస్ అవ్వాలని విషెస్ తెలిపారు.

Read Also : సమంత ఆవేదన

ఈ సినిమా ముహుర్తం షాట్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా, నిర్మాత రాజశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టారు. ఆయన కుమార్తె, కొడుకు ఈశన్వి, ధృవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిల్ మొదటిసారి ఈ సినిమాలో గూఢచారి పాత్రను పోషించబోతున్నాడు. డైరెక్టర్ గ్యారీ బీహెచ్ స్వతహాగా ఎడిటర్‌ కావడంతో ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలను అతనే తీసుకున్నాడు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ కాగా, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. అనిరుధ్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి రచయిత. అర్జున్ సురిశెట్టి ఆర్ట్ డైరెక్టర్‌గా, రవి ఆంటోని ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version