Nikhil Vijayendra Simha New Movie as Hero: లహరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న “సంగీత్” చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నిహారిక కొణిదెల సినిమా యూనిట్ కి స్క్రిప్ట్ అందించగా, హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యవ్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్‌కు ఎస్.ఎస్. కార్తికేయ క్లాప్ కొట్టారు. కన్నడలో ‘హంబుల్ పొలిటీషియన్ నోగ్‌రాజ్’తో ఎంతగానో గుర్తింపు పొందిన రచయిత-దర్శకుడు సాద్ ఖాన్ “సంగీత్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆకట్టుకునే కథాంశాన్ని ఎంచుకున్న ఆయన తెర మీద సరికొత్త అనుభూతిని పంచనున్నారని మేకర్స్ ప్రకటించారు. ప్రేమ, కుటుంబ బంధాలు, జీవితంలోని మధురానుభూతుల మేళవింపుతో “సంగీత్” చిత్రం తెరకెక్కుతోంది. సమర్థ్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది.
Rashmi Gautam: జీవితాలను రిస్క్‌లో పెట్టింది ఎవరు?.. అలా వదిలేయకండి ప్లీజ్!
సమర్థ్ పాత్రలో హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యవ్ సోదరుడు, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ కనువిందు చేయనున్నారు. తన సోదరుడి వివాహ వేడుకలో సమర్థ్ జీవితం ఎలాంటి ఊహించని మలుపు తిరిగింది అనేది వినోదాత్మకంగా చూపించబోతున్నారని అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న నిఖిల్ విజయేంద్ర సింహాను “సంగీత్” చిత్రం ద్వారా లహరి ఫిల్మ్స్ పరిచయం చేస్తోంది. నిఖిల్ కి జోడిగా తేజు అశ్విని కనిపించనుంది. ఇక ఈ సందర్భంగా నిఖిల్ విజయేంద్ర సింహా మాట్లాడుతూ.. “ఈరోజు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, ‘సంగీత్’ నా హృదయానికి దగ్గరగా ఉన్న కథ. కథానాయకుడిగా సమర్థ్ పాత్రలోని భావోద్వేగాలను చూపించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా, ఈ చ్చునా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.