NTV Telugu Site icon

Nikhil: హీరో అవ్వడానికి వారికి రూ. 5 లక్షలు ఇచ్చి మోసపోయాను..

Nikhil

Nikhil

Nikhil: కష్టం లేనిదే ఫలితం రాదు.. ఇప్పుడున్న స్టార్ హీరోలందరు ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించినవారే. అంత కష్టపడి సక్సెస్ ను అందుకున్నారు కాబట్టే వారు మిగతావారికి ఆదర్శంగా మారారు. ఇక కుర్ర హీరో నిఖిల్ సైతం అలాంటి సినిమా కష్టాలనే ఎదుర్కొన్నాడట. సినిమా హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి, సీరియల్స్ చేసి, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి.. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక నిఖిల్ నటించిన 18 పేజీస్ నేడు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే నిఖిల్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గతాన్ని, సినిమా కష్టాలను నెమరువేసుకున్నాడు.

యంగ్ ఏజ్ లోనే హైదరాబాద్ నవాబ్స్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.. అప్పటి రోజులను తలుచుకుంటే మీకేం అనిపిస్తోంది అన్న ప్రశ్నకు.. నిఖిల్ సమాధానమిస్తూ.. ” సుదీర్ వర్మ నాకు ఈ సలహా ఇచ్చాడు.. నేను హీరో అవుతా అని అందరి ముందు చెప్తే నవ్వి పక్కకు పంపిస్తారు.. అసలు సినిమా ఏంటి..? ఎలా ఉంటుంది..? అనేది నేర్చుకో.. తరువాత సినిమా హీరో అవ్వొచ్చు అని చెప్పడంతో నేను అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను.. సినిమా ఎలా తీస్తారు అనేది నేర్చుకున్నాను. హ్యాపీ డేస్ వరకు నాలుగు చిన్న చిన్న సినిమాలు చేశాను. చదరంగం అనే సీరియల్ 40 ఎపిసోడ్స్ చేశాను.. అప్పుడు సీరియల్స్ కు చాలా అవకాశాలు వచ్చాయి. ఇక ఇలానే చేసుకుంటూ పోతే అక్కడే ఉండిపోతానేమో అని ఆడిషన్స్ కు వెళ్లడం మొదలుపెట్టాను.ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ నా యాక్టింగ్ నచ్చి సినిమా చేస్తామని చెప్పారు.. ఆ తరువాతఏవో కారణాల వలన అవి ఆగిపోయాయని తెలిసేది. ఆ తరువాత ఆంధ్రా ఐడల్ అనే ప్రోగ్రామ్ లో గెలిస్తే సినిమా ఛాన్స్ వస్తుందని చెప్పారు. అందులో నేనే ఫస్ట్ వచ్చా..కానీ నాతో సినిమా చేస్తాను అన్నవారు తరువాత కనిపించలేదు.

హ్యాపీ డేస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలా నిజాయితీ గల మనిషి.. నన్ను చూసారు.. ఆ పాత్రకు నేను సెట్ అవుతాను అని అనుకోవడమే తీసేసుకున్నారు.. ఆయనే నాకు ఫస్ట్ చెక్ ఇచ్చారు. పాతికవేలు.. ఇప్పటివరకు ఆ చెక్ ను అలాగే డ్రా చేయకుండా ఉంచుకున్నాను. నిజం చెప్పాలంటే ఒక యంగ్ స్టార్ బయటికి వస్తున్నాడు అంటే డబ్బులు అడుగుతారు. నువ్వు హీరోగా చేయాలా.. ఒక 50 లక్షలు, కోటి తీసుకురా హీరో చేస్తా అని అంటారు. నన్ను కూడా అడిగారు. అలా అడిగినవారు ఎవరు జెన్యూన్ కాదు.. అడిగినవారు ఎవరు సినిమా తీయరు. అలా నేను హీరో అవ్వడానికి రూ. 5 లక్షలు ఇచ్చాను. 5 లక్షలకు తగ్గట్టు ఒక లక్ష షూటింగ్ చేసి ఆపేశారు. ఆ సినిమా పేరు క్రికెట్ అనుకుంటా.. ఇప్పుడు వారు ఇండస్ట్రీలో ఉన్నారో లేదో తెలియదు. ఇంట్లో చాలా కష్టపడి అమ్మను అడిగి డబ్బులు తీసుకెళ్ళాను. అదంతా ఫేక్.. అని అర్ధమయ్యింది” అని చెప్పుకొచ్చాడు.