Site icon NTV Telugu

Nikhil Siddarth: కృష్ణుడి రహస్యం అయిపొయింది… ఇట్స్ టైమ్ ఫర్ బోస్

Nikhil

Nikhil

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ‘కార్తికేయ 2’ సినిమాలో ‘శ్రీకృష్ణుడి ద్వారక రహస్యాన్ని’ కనుక్కునే కథతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇప్పుడే ఇదే మ్యాజిక్ ని రిపీట్ చేసేలా ఈసారి ‘సుభాష్ చంద్ర బోస్ మిస్సింగ్ ఫైల్’ గురించి సినిమా చేసి పాన్ ఇండియా హిట్ కొట్టడానికి ‘స్పై’ సినిమాతో రెడీ అయ్యాడు. అడివి శేష్ నటించిన ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలకి ఎడిటర్ గా వర్క్ చేసిన గ్యారీ ‘స్పై’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. హై బడ్జట్ తో, స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న స్పై మూవీని మేకర్స్ జూన్ 29న రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్, స్పై టీజర్ ని రిలీజ్ చేశారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ఉన్న నేతాజీ విగ్రహం దగ్గర స్పై సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. కర్తవ్య పథ్ లాంటి ఐకానిక్ లొకేషన్ లో జరుగిన మొదటి సినిమా టీజర్ లాంచ్ ఇదే కావడం విశేషం.

స్పై సినిమా ప్రమోషన్స్ కి పర్ఫెక్ట్ లొకేషన్ ని ఎంచుకున్న నిఖిల్, టీజర్ తో పర్ఫెక్ట్ పాన్ ఇండియా బొమ్మ చూపించాడు. భగవన్ ఫైల్ మిస్ అయ్యింది అనే దగ్గర మొదలైన టీజర్, నిమిషమున్నర పాటు బ్రెత్ టేకింగ్ విజువల్స్ తో సాగింది. హైఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటెన్స్ సీన్స్, నిఖిల్ స్టన్నింగ్ స్టంట్స్ ‘స్పై’ టీజర్ ని చాలా స్పెషల్ గా మార్చాయి. టీజర్ ని శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. “సుభాష్ చంద్ర బోస్ చనిపోయాడు అనేది కవర్ అప్ స్టొరీ, అసలు నిజం వేరు” అనే డైలాగ్ తో ఇంట్రెస్ట్ ని పెంచిన మేకర్స్… “ఈ నిజం మనం ప్రపంచానికి చెప్పాలి” అని నిఖిల్ చెప్పిన డైలాగ్ తో డైరెక్టర్ తన ఇంటన్షన్ ని క్లియర్ గా చెప్పేశాడు. పాన్ ఇండియా మార్కెట్ కి తగ్గ కథతో, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో స్పై సినిమా జూన్ 29న ఆడియన్స్ ముందుకి రానుంది. టీజర్ ఇచ్చిన హై చూస్తుంటే నిఖిల్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడినట్లే ఉంది.

Exit mobile version