NTV Telugu Site icon

Nikhil Dwivedi: పాకిస్తాన్ పై ప్రధాని ట్వీట్.. హీరో సైటైర్ వైరల్.. ?

Nikhill

Nikhill

Nikhil Dwivedi:బాలీవుడ్ హీరో నిఖిల్ ద్వివేది గురించి పరిచయం చేయాలంటే స్కామ్ 1992 లో వ్యాపారవేత్త కేఎస్ త్యాగి పాత్ర చేసి మెప్పించిన నటుడు. ఇక ఈ సినిమా తరువాత ఫేమస్ అయ్యిన నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో తనకు నచ్చినవాటిపై ట్వీట్ చేస్తూ అభిమానులకు దగ్గర ఉండే ఈ హీరో వేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులోనూ ప్రధాన మంత్రి మోడీ చేసిన ట్వీట్ కు ఆయన రిప్లై ఇవ్వడంతో ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. కొన్నిరోజులుగా పాకిస్తాన్ వరదల కారణంగా అల్లాడుతున్న విషయం విదితమే. భారీ వర్షాల కారణంగా సగానికి పైగా పాకిస్తాన్ కొట్టుకుపోయింది. ఇక పాకిస్తాన్ దీన స్థితిపై మోడీ సానుభూతి చూపించారు. పాకిస్తాన్ త్వరగా యథాస్థితికి రావాలని ఆకాంక్షించారు. “పాకిస్తాన్ లో వరదల కారణంగా ఎంత విధ్వంసం జరిగిందో చూసి చాలా బాధపడ్డాను. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ మోడీ ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ పై నిఖిల్ స్పందించాడు. “ప్రధాని మోడీ గారు.. ఇది చాలా మంచి ట్వీట్. మీరు చాలా మంచి దేశాధినేత. పాకిస్తాన్ మన శత్రు దేశం. అయినా ఆ దేశం బాధల్లో ఉందని తెలిసి మానవత్వంతో వారు కోలుకోవాలని చెప్పడం నిజంగా విశేషం. శత్రుత్వం కన్నా మానవత్వం ముఖ్యమని నిరూపించారు. నిజమైన నాయకులే ఇలా స్పందిస్తారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీఖాన్ లాంటి హీరోలు కూడా ఇలా స్వేచ్ఛగా ట్వీట్ చేసే వాతావరణం నెలకొనాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ అంతా బావుంది కానీ, చివర్లో బాలీవుడ్ హీరోల గురించి మాట్లాడి నిఖిల్ ట్వీట్ ను వివాదం అయ్యేలా చేశాడంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ ప్రధాని చేశాడు కాబట్టి ఓకే.. అదే బాలీవుడ్ హీరోలలో ఎవరైనా ఈ విధంగా చేస్తే ఈపాటికి విమర్శలు వెల్లువెత్తేవి. ఎందుకంటే వారు ముస్లిం హీరోలు కాబట్టి అని చెప్పుకొస్తున్నారు. ఇక హీరో సైతం ఇదే విషయాన్ని కొంచెం సెటైరికల్ గా వేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు అతను మంచిగానే చెప్పాడు అని ప్రశంసిస్తున్నారు.

Show comments