Site icon NTV Telugu

Sundeep Kishan: రికార్డ్ సృష్టించిన ‘నిజమే నే చెబుతున్నా’ సాంగ్

Nijame Ne Chebutunna Crosses 100 Million Views

Nijame Ne Chebutunna Crosses 100 Million Views

Nijame Ne Chebutunna Crosses 100 Million Views: హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’ ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలౌతుంది. . హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఊరు పేరు భైరవకోన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ రాగా సినిమా కోసం శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో ‘నిజమే నే చెబుతున్నా’ పాట సెన్సేషనల్ వైరల్ హిట్ గా నిలిచింది. పాపులర్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట అందరినీ మెస్మరైజ్ చేసింది. శ్రీ మణి అందించిన సాహిత్యం మరింత ఆకర్షణగా నిలిచింది, ఈ పాటలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ బ్యూటీఫుల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది.

Fake Collections: ముదురుతున్న ఫేక్ కలెక్షన్స్ వివాదం.. ఆ వెబ్ సైట్స్ కి నోటీసులు?

ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి అన్ని సోషల్ మీడియా మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ లో టాప్ ట్రెండింగ్ గా అలరిస్తోంది. తాజాగా ఈ పాట 100 మిలియన్+ వ్యూస్ ని క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. బిగ్గెస్ట్ హిట్ గా అలరిస్తున్న ఈ పాటని బిగ్ స్క్రీన్స్ పై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇక ఇటీవల విడుదలైన ఊరు పేరు భైరవకోన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. వండర్ ఫుల్ ఫాంటసీ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచిందనే చెప్పాలి. వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ ‘ఊరు పేరు భైరవకోన’కి సంభాషణలు అందిస్తున్నారు.

Exit mobile version