Nihir Kapoor Interview about Record Break Movie: రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో నిహిర్ కపూర్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి పలు అంశాలు పంచుకున్నారు.
గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేస్తున్నప్పుడు చదలవాడ శ్రీనివాసరావు చాలా బాగా చేసావు ఒక కథ ఉంది ఆ కథకు నువ్వు యాప్ట్ అవుతావని చెప్పారు. కథ వినగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించి చేస్తానని ఒప్పుకున్నా, హీరోగా అని కాకుండా క్యారెక్టర్రైజేషన్ చాలా బాగుండడంతో ఈ కథ ఒప్పుకున్నా.
*ఇద్దరు అనాధ ట్విన్స్ అడవిలో పెరుగుతూ ఉంటారు. అడవి నుంచి కుస్తీ పోటీలు నేర్చుకుని సిటీకి వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ లో డబ్ల్యూ డబ్ల్యూ ఈ దాకా వెళ్లడం ఆ ప్రయాణాన్ని చాలా బాగా చూపించారు.
*ఇది కమర్షియల్ సినిమా, దంగల్ తో కంపారిజన్ ఉండదు. అందులో కుస్తీ పోటీలు ఇవన్నీ డీటెయిల్ గా ఉంటాయి. ఇందులో కుస్తీ పోటీల గురించి చెబుతూ ఇద్దరు అనాధల జర్నీ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళింది అలాగే సెంటిమెంట్ ఎమోషనల్ అన్ని కలగలిపి ఒక కమర్షియల్ సినిమా అనిపిస్తున్నది. మంచి మదర్ సెంటిమెంట్ సాంగ్స్ ఫైట్స్ అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి.
*ఇందులో డబ్ల్యూ డబ్ల్యూ పోటీలు చూపిస్తున్నాము, కుస్తీ పోటీల నుంచి డబ్ల్యు డబ్ల్యు ఈ దాకా జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. రాజస్థాన్ హర్యానా లాంటి ప్రాంతాల్లో కుస్తీ పోటీలు ఎక్కువగా జరుగుతాయి ఆ డీటైలింగ్ మీద నార్త్ వాళ్ళు ఎక్కువ సినిమాలు తీస్తారు కానీ మన సినిమాలో కుస్తీ పోటీలతో పాటు మిగతా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇది తెలుగు సినిమా అయినా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా అందుకే ఇలాంటి సినిమా తెలుగుతోనే ఆగిపోకూడదు. అందుకే ఎనిమిది భాషల్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం.
*రీసెంట్ గా బెంగళూరు, చెన్నై వెళ్లి అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ముంబైలో కూడా ఇలాంటి కథలు ఎక్కువగా చూస్తారు అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది, ఇంకా మలయాళం, ఒడియాలో కూడా నెక్స్ట్ ప్రమోట్ చేస్తున్నాము.
*చదలవాడ శ్రీనివాసరావుకు సినిమా అంటే పాషన్. ఈ కథని జనాలకి చెప్పాలనుకుంటున్నారు. ఆయన ఒక సోషల్ సబ్జెక్ట్ ని సోషల్ కాన్సెప్ట్ ని తీసుకుని సినిమాలు చేస్తారు, ఇది కూడా అలాంటి ఒక మంచి కాన్సెప్ట్, ఇది పూర్తిగా దేశభక్తి సినిమా.
*యాక్షన్ సీక్వెన్సెస్ జాషువా గారు చేస్తున్నారు, ఆయన చేసిన ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. చదలవాడ శ్రీనివాసరావు ఎక్స్పీరియన్స్ -రెండు విజన్ అదేవిధంగా జాషువా యాక్షన్ సీక్వెన్సెస్ సినిమా కి చాలా ప్లస్ అవుతాయి. అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్ కన్నా క్యారెక్టర్ రైజేషన్స్ ని ఎక్కువగా చూస్తారు.
*జయసుధ ట్రైలర్ చూశారు, సినిమాని కొంత చూశారు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మళ్లీ ఒకసారి ఫుల్ సినిమా చూసిన తర్వాత ఏం చెప్తారు అనేది నేను వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ అయితే జయసుధ గారికి చాలా నచ్చింది. అమ్మ బిజీగా ఉన్నారు కథ నేనే విని ఒకే చేశా యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నావ్ అని చెప్పి చాలా మెచ్చుకున్నారు.
*కచ్చితంగా కంటిన్యూగా ఇంక సినిమాలు చేస్తూ ఉంటాను., కచ్చితంగా డైరెక్షన్ చేస్తాను కాకపోతే దానికి కొంచెం టైం ఉంది. స్క్రిప్స్ రాసుకున్నాను ఓటీటీ కి, ఫ్యూచర్ ఫిలిం కి రెండిటికి ట్రై చేస్తున్నాను. టైం సెట్ అయితే కచ్చితంగా చేస్తాను.