Site icon NTV Telugu

Niharika Konidela: మెగా డాటర్ రీ ఎంట్రీ.. పాఠాలు నేర్చుకొని మరీ వచ్చిందంట

Niharika

Niharika

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియా ఉంటూ తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం నిహారిక ఇన్స్టాగ్రామ్ ను డిలీట్ చేయడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ తరువాత అమ్మడు పబ్ కేసులో దొరకడం సంచలనంగా మారిన విషయం విదితమే. ఇక ఈ కేసు తరువాత నిహారిక ఇంటికే పరిమితమయ్యింది. మీడియా ప్రెషర్ ని తట్టుకోలేక కొద్దిరోజులు కెమెరాకు దూరంగా ఉన్న మెగా డాటర్ ఇటీవలే నిర్మాతగా మరో ప్రాజెక్ట్ ను మొదలుపెట్టిన విషయం విదితమే.

ఇక తాజాగా అమ్మడు మరోసారి ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టింది. లేటెస్ట్ ఫోటోను షేర్ చేస్తూ అందరికి వెల్ కమ్ చెప్పింది. దాంతో పాటు ఈ కొద్దిరోజుల్లో తానూ నేర్చుకున్న పాఠాలను కూడా లైన్ గా చెప్పుకొచ్చింది. ” ఇన్స్టాగ్రామ్ కు బ్రేక్ చెప్పిన ఈ 8 వారాలలో నేను మూడు పాఠాలు నేర్చుకున్నాను. 1.ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.. 2. ఇతరులు ఏమి చేస్తున్నారు అనేది పట్టించుకోను.. 3. ఇప్పుడు నేను రిఫ్రెష్ అయ్యాను .. ఇకనుంచి ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నాను”. అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వెల్ కమ్ బ్యాక్ నిహారిక అని కొందరు అంటుండగా .. మరికొందరు ఎప్పటిలాగానే అమ్మడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Exit mobile version