NTV Telugu Site icon

Niharika Konidela: ఎవడేమన్నా నాకు దాంతో సమానం.. నిహారిక వీడియో వైరల్

Niharika

Niharika

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల డివోర్స్ గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మూడేళ్ళ క్రితం చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది నిహారిక. ఇక రెండేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య అనుకోని విబేధాలు తలెత్తాయి. ఇక ఆ విబేధాలు చిలికి చిలికే గాలివానగా మారి విడాకుల వరకు వచ్చాయి. 6 నెలల క్రితమే ఈ జంట విడాకులకు పిటిషన్ పెట్టుకోగా.. ఈ మధ్యనే కోర్ట్ వీరికి విడాకులు మంజూరు చేసింది. ఇక విడాకులు వచ్చాయి అని తెలిసినాక.. నిహారిక.. తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అధికారికంగా తెలిపింది. ” చైతన్య, నేను ఎంతో మ్యూచువల్ గా విడిపోయాం. మా దారులు వేరు అయ్యాయి. ఇక నుంచి మేముకొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. దయచేసి మా ప్రైవసీకి ఇబ్బంది కలిగించవద్దని మనవి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన ట్రోలర్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నీ వలనే విడాకులు అయ్యి ఉంటాయి అని కొందరు.. మూడేళ్లకే విడాకులు ఏంటి..? అని మరికొందరు కామెంట్స్ పెడుతూ నెగెటివీటి నిక్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ కు మెగా అభిమానులు నిహారిక ఓల్డ్ వీడియోను సమాధానంగా షేర్ చేస్తున్నారు.

Sai Sushanth Reddy: పెళ్లి పీటలు ఎక్కనున్న సుశాంత్.. ఎంగేజ్మెంట్ పిక్ వైరల్

డెడ్ ఫిక్సల్స్ వెబ్ సిరీస్ రిలీజ్ సమయంలో నిహారిక ఒక ఇంటర్వ్యూలో ట్రోలర్స్ గురించి కామెంట్స్ చేసిన వీడియోను షేర్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ అంటూ చెప్పుకొస్తున్నారు. అందులో నిహారిక మాట్లాడుతూ.. ” ట్రోలర్స్ గురించి నేను పట్టించుకోను. నేను దేన్నీ ఎక్కువగా తీసుకోలేదు.. అది ప్రశంస అయినా.. విమర్శ అయినా.. నన్ను చాలా పొగిడితే .. ఓహో.. అది ఇది అని నేను అనుకోను. నా కుటుంబంలో నా తల్లిదండ్రులు, అన్నయ్య చాలా టైట్.. నాకున్న ఫ్రెండ్స్ కూడా టైట్.. వారే నా ప్రపంచం. వారు తప్ప ఎవడేమన్నా నాకు వెంట్రుకతో సమానం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.