Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niharika Konidela: హైదరాబాద్‌లో బోనాల సందడి అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ పండుగ సమయంలో నిర్మాత నిహారిక కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాతబస్తీలోని మీరాలం మండిలో ఉన్న శ్రీ మహంకాళేశ్వర ఆలయానికి వెళ్లిన ఆమె అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిహారిక ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకున్నారు నిహారిక కొణిదెల.
నిహారిక అమ్మవారి దర్శనానికి వచ్చిన విషయం తెలియడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల్లోనూ ఆసక్తి పెరిగింది. నిహారిక ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. దీంతో కొద్దిసేపు ఆలయ ప్రాంగణం అభిమానులు, భక్తులతో సందడిగా మారింది. సినీ కార్యక్రమాలతో బిజీగా ఉండే నిహారిక బోనాల సందర్భంగా సంప్రదాయబద్ధంగా బంగారు బోనం ఎత్తి అమ్మవారిని దర్శించుకోవడం అక్కడి భక్తుల్లో కూడా ఉత్సాహం నింపింది. అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య ఈ సందర్భంగా నిహారికకు శ్రీ మహంకాళేశ్వర ఆలయ చరిత్ర, అక్కడ నిర్వహించే బోనాల ఉత్సవాల ప్రత్యేకత, వాటికి సంబంధించిన సంప్రదాయాలను వివరించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నిహారిక తనకు బోనాల పండుగతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రధాన బోనాల రోజున షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని, అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన తనకు చిన్నప్పటి నుంచి బోనాల వేడుకలు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకుని అమ్మవారి ఆలయాలకు వెళ్లే దృశ్యాలు తనను ఎప్పుడూ ఆకట్టుకునేవని పేర్కొన్నారు.
కొద్ది రోజుల క్రితం సరదాగా తనను కూడా ఎవరైనా బోనాలకు తీసుకెళ్తే బాగుండేదని చెప్పానని, ఇప్పుడు ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరడం అమ్మవారి అనుగ్రహంగానే భావిస్తున్నానని నిహారిక తెలిపారు. అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత అని చెబుతూ, ఈరోజు దర్శనం తనకు ఎంతో ప్రశాంతత, ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం దివ్య కాంతులతో ఎంతో ఆకట్టుకుందని, మరోసారి కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం కలగాలని కోరుకున్నారు.
- Tags
- cinema
- NIharika Konidela
తాజావార్తలు
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!