Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నిర్మాతగా సెటిల్ అయిపోయింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా అమ్మడికి లక్ కలిసిరాకపోవడంతో చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇక తనకున్న సినీ ఆసక్తితో నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ మంచి విజయాలను అందుకొంటుంది. ఇటీవలే హలో వరల్డ్ వెబ్ సిరీస్ ను నిర్మించి మంచి హిట్ కొట్టింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ గత కొన్ని రోజుల నుంచి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం విదితమే.
ఇక తాజాగా మెగా డాటర్ టర్కీలో వాలిపోయింది. స్నేహితులతో కలిసి బికినీలో బీచ్ ఒడ్డున రచ్చ చేసింది. ఇప్పటివరకు మెగా డాటర్ బికినీ లో కనిపించింది లేదు. ఇక అందులోనూ పెళ్లి తరువాత అరకొర దుస్తుల్లో కనిపించినా నిహారిక అందంగానే ఉండేది. ఇక తాజాగా మొదటిసారి నిహారిక బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. తన టర్కీ స్నేహితురాలితో కలిసి బీచ్ ఒడ్డున సెల్ఫీ కి పోజు ఇస్తూ దర్శనమిచ్చింది. టర్కీ భాషలో స్నేహితురాలు తన గురించి చెప్పిన మాటలకు సమాధానం ఇస్తూ ” నువ్వు నా గురించి ఏం చెప్పావో ఒక్క ముక్క అర్ధం కాలేదు. అయినా ఈసారి టర్కీ వచ్చినప్పుడు ఇంకా ఎంజాయ్ చేద్దాం” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
