Site icon NTV Telugu

Niharika Konidela: మెగాడాటర్ నిహారిక-చైతన్య విడాకుల ప్రక్రియ పూర్తి?

Niharika Chaitanya Are Divorced

Niharika Chaitanya Are Divorced

Niharika konidela and Chaitanya Are Divorced Officially: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కొంతకాలం క్రితం చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్దలు కుదిర్చిన వీరి వివాహం కొన్నాళ్ల క్రితం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి కుటుంబ సభ్యులు వివాహాన్ని రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో ఘనంగా నిర్వహించారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద అటు మెగా ఫ్యామిలీ నుంచి ఖండన కానీ అలాగే సమర్థన కానీ ఏదీ రాలేదు. కేవలం మెగా ఫ్యామిలీ అనే కాదు చైతన్య జొన్నలగడ్డ కుటుంబం నుంచి కూడా రాలేదు. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ప్రస్తుతానికి నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డ దంపతులు అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నిజానికి ఇద్దరూ మ్యూచువల్ డైవర్స్ కోసం కొన్నాళ్ల క్రితం అప్లై చేశారని అది ఈరోజుతో అఫీషియల్ గా పూర్తయింది అని తెలుస్తోంది.

Anantha Sriram: దివంగత వైఎస్సార్‌ను అవమానపరిచేలా పోస్టులు.. వీడియో రిలీజ్ చేసిన అనంతశ్రీరామ్

వీరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు కోర్టు అధికారికంగా ప్రకటించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నట్లయింది. ఇక వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే వివరాల మీద మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఈ ఏడాది మార్చి నెలలో జొన్నలగడ్డ చైతన్య అతని ఇంస్టాగ్రామ్ ఖాతాలో నిహారికతో ఉన్న అన్ని ఫోటోలు డిలీట్ చేసినప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి అని ప్రచారం మొదలైంది. అప్పుడే వీరు విడిపోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అప్పటికి నిహారిక ఆ ఫోటోలను తొలగించకపోవడంతో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఏమో అనుకున్నారు. ఆ తర్వాత నిహారిక కూడా చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం తెర మీదకు వచ్చింది. ఇక వీరి విడాకుల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో మెగా ఫ్యామిలీ నుంచి ఈ విషయం మీద ఏదైనా క్లారిటీ వస్తుందేమో వేసి చూడాలి.

Exit mobile version