NTV Telugu Site icon

Niharika: రాహుల్ ఇంటి ముందు అమ్మాయిలు క్యూ.. ఆ విషయం బయటపెట్టిన నిహారిక

Nikarika Rahul

Nikarika Rahul

Niharika Chef Mantra New Episode Rahul-Hemachandra goes Viral: మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల తర్వాత సినిమాలపై మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఓ తమిళ సినిమా మద్రాస్ కారన్ తో బిజీగా ఉండగా.. ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా చెఫ్ మంత్ర సీజన్ 3కి హోస్ట్ గాకూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ కాస్త ఘాటుగానే నడుస్తుందనే టాక్ వినిపిస్తుంది. చాలా దారుణంగా డ్యాష్ పదాలను ఉపయోగిస్తూ.. ఏ సర్టిఫికెట్ షోలా తయారైంది. ఆ విషయం పక్కన పెడితే.. ఈ సీజన్ 6 వ ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో గెస్టులుగా ప్రముఖ సింగర్స్ హేమచంద్ర, రాహుల్ సిప్లిగంజ్ వచ్చారు. వీరితో నిహారిక కలిసి ఫన్ పండించేందుకు ప్రయత్నం చేసింది. ప్రోమో విషయానికి వస్తే.. పెద్ద పులి సాంగ్ కు ఇద్దరు సింగర్స్ తో పాటు నిహారిక కలిసి డ్యాన్స్ చేసింది.

Pawan Kalyan: నన్ను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ సంచలనం

ఇక నిహారికతో కలిసి పాట పాడించాలని రాహుల్ అనగానే.. ఆహాకు ఇదే లాస్ట్ ఎపిసోడ్ అవుతుందని నిహారిక అనడం ఫన్ కలిగించింది. పంచాంగం చూస్తారా అని నిహారిక.. రాహుల్ ను అడగ్గా నేను చూసుకోకున్నా బాగుంటుందని చెప్పుకొచ్చారు రాహుల్. వీరికి డ్యాష్ క్వశ్చన్స్ ఇచ్చి కాస్త ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. యాదమ్మ రాజు.. తన పేరు రాహుల్ అప్జల్ గంజ్ అంటూ రావడం కాస్త నవ్వులు పూయించింది. రాహుల్, హేమచంద్ర కలిసి పలు వంటలు చేశారు. ఇక రాహుల్ వంటలకు నిహారిక ఫిదా అయినట్లు తెలుస్తోంది. రాహుల్ నీకు ఇంత వంట వచ్చని తెలిస్తే.. నీ ఇంటి ముందు అమ్మాయిలు క్యూ కడతారు అంటూ నిహారిక కామెడీ చేసింది. దీంతో రాహుల్ ఎందుకు అందరికీ వంట చేసి పెట్టాలా అంటూ సెటైర్ వేస్తాడు. ఈ ఎపిసోడ్ ఉగాది పర్వదినం సందర్భంగా టెలికాస్ట్ కానుంది.

Show comments