Nidhi Agarwal: ఆ డ్రీమ్ ఇప్పట్లో నెరవేరేలా లేదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వస్తూ ఫాన్స్ కి ఖుషి చేస్తున్నాయి కానీ ఒక్క సినిమా మాత్రం అసలు సౌండ్ చెయ్యకుండా సైలెంట్ గా ఉంది. OG, ఉస్తాద్, బ్రో సినిమాల కన్నా భారీ బడ్జట్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు. ‘మొఘలు’లపై తిరుగుబాటు చేసిన బందిపోటుగా కనిపించనున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామాగా గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ పవన్ ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. దుండిగల్ సమీపంలోని బోరంపేట్‌లో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన భారీ సెట్ లో హరిహర వీరమల్లు సినిమా చాలా భాగం షూటింగ్ కూడా జరుపుకుంది.
OG, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో సినిమాలకి డేట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్… ఇప్పటికే మూడు సార్లు విడుదల వాయిదా పడిన ఈ మూవీని ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే ప్రశ్నలకి సమాధానం దేవుడికే తెలియాలి. పాపం ఈ మూవీపై ఎంతో హోప్ పెట్టుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. “Dream come true! So grateful to be a part of the epic journey in the upcoming movie #HariHaraVeeraMallu with Power Star @PawanKalyan sir, @DirKrish sir and @AMRatnamOfl sir. Working alongside such an incredible team has been an absolute blessing. Trust me, you’ll all see the magic soon! PS : This was my first shot in the film” అంటూ నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది నిధి అగర్వాల్ కి హరిహర వీరమల్లు షూటింగ్ డే 1 తీసిన పిక్ అంట. ఇస్మార్ట్ శంకర్‌తో మంచి హిట్ అందుకున్న నిధి.. పవన్‌తో ఛాన్స్ రావడంతో ఎగిరిగంతేసింది. కానీ హరిహర వీరమల్లు ఇప్పట్లో తిరిగి సెట్స్ పైకి వెళ్లేలా లేదు. దీంతో కనీసం లైమ్ లైట్లో కూడా లేకుండా పోయింది నిధి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Dream come true!
So grateful to be a part of the epic journey in the upcoming movie #HariHaraVeeraMallu with Power Star @PawanKalyan sir, @DirKrish sir and @AMRatnamOfl sir. 🎬
Working alongside such an incredible team has been an absolute blessing. Trust me, you'll all see… pic.twitter.com/VONjJOA9er— Nidhhi Agerwal (@AgerwalNidhhi) July 17, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!