Site icon NTV Telugu

Nidhi Agarwal: ఆ డ్రీమ్ ఇప్పట్లో నెరవేరేలా లేదు…

Nidhi Agarwal

Nidhi Agarwal

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వస్తూ ఫాన్స్ కి ఖుషి చేస్తున్నాయి కానీ ఒక్క సినిమా మాత్రం అసలు సౌండ్ చెయ్యకుండా సైలెంట్ గా ఉంది. OG, ఉస్తాద్, బ్రో సినిమాల కన్నా భారీ బడ్జట్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు. ‘మొఘలు’లపై తిరుగుబాటు చేసిన బందిపోటుగా కనిపించనున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామాగా గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ పవన్ ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. దుండిగ‌ల్ స‌మీపంలోని బోరంపేట్‌లో ఆర్ట్ డైరెక్టర్ తోట త‌ర‌ణి వేసిన భారీ సెట్ లో హరిహర వీరమల్లు సినిమా చాలా భాగం షూటింగ్ కూడా జరుపుకుంది.

OG, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో సినిమాలకి డేట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్… ఇప్పటికే మూడు సార్లు విడుదల వాయిదా పడిన ఈ మూవీని ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే ప్రశ్నలకి సమాధానం దేవుడికే తెలియాలి. పాపం ఈ మూవీపై ఎంతో హోప్ పెట్టుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. “Dream come true! So grateful to be a part of the epic journey in the upcoming movie #HariHaraVeeraMallu with Power Star @PawanKalyan sir, @DirKrish sir and @AMRatnamOfl sir. Working alongside such an incredible team has been an absolute blessing. Trust me, you’ll all see the magic soon! PS : This was my first shot in the film” అంటూ నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది నిధి అగర్వాల్ కి హరిహర వీరమల్లు షూటింగ్ డే 1 తీసిన పిక్ అంట. ఇస్మార్ట్ శంకర్‌తో మంచి హిట్ అందుకున్న నిధి.. పవన్‌తో ఛాన్స్ రావడంతో ఎగిరిగంతేసింది. కానీ హరిహర వీరమల్లు ఇప్పట్లో తిరిగి సెట్స్ పైకి వెళ్లేలా లేదు. దీంతో కనీసం లైమ్ లైట్లో కూడా లేకుండా పోయింది నిధి.

Exit mobile version