పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ డైమండ్ల దొంగగా కనిపించనున్నారట. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నిధి పాత్రపై ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. నిధి అగర్వాల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. పవన్ కళ్యాణ్ ను ఆమె మోసం చేసే పాత్రలో కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. నిధి ట్విస్ట్ ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తోందని అంటున్నారు. త్వరలోనే తిరిగి సెట్స్ పైకి వెళ్లనున్న షెడ్యూల్ లో నిధి కూడా పాల్గొననుంది.
హరి హర వీరమల్లు: నిధి ట్విస్ట్ అదిరిపోతుందట!
