ఇస్మార్ట్ బ్యూటీ వరుస ఆఫర్లతో టాలీవుడ్ లోనే కాదు తమిళ సినిమాలతోను బిజీ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మొదటి సినిమా ‘హీరో’ లో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్ లోను ఓ బడా హీరోతో నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయని త్వరలోనే ప్రకటన రానుందని వినికిడి. కాగా ఈ సినిమాకే కంటే ముందే నిధి మరో తమిళ సినిమాకి కమిట్ అయినట్లుగా సమాచారం. ఇప్పటికే బిజీగా వున్నా నిధికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా నిలువడం ఖాయంగా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
ఆఫర్లతో ‘అందాల నిధి’ ఫుల్ బిజీ!
