Site icon NTV Telugu

Nidhi Agerwal : నెటిజన్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన నిధి అగర్వాల్..

Nidhi

Nidhi

Nidhi Agerwal : సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద అప్పుడప్పుడూ నెటిజన్లు ఇబ్బంది పెట్టే కామెంట్లు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు సెలబ్రిటీలు వాటిని సీరియస్ గా తీసుకుని స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా ఇలాగే సీరియస్ గా స్పందించింది. తాజాగా ఓ పేజీలో నిధి గురించి పోస్టు చేశారు. దానిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నిధి అగర్వాల్ ను శ్రీలీలతో పోలుస్తూ కామెంట్ చేశాడు. శ్రీలీల ఇప్పటికే చాలా సినిమాలు చేస్తోందని.. నిధి మాత్రం ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఏం చేసింది అంటూ ప్రశ్నించాడు. ఈ కామెంట్ కు స్వయంగా నిధి అగర్వాల్ సీరియస్ గా స్పందిస్తూ అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది.

Read Also : Jr NTR: ఎన్టీఆర్ బక్క చిక్కడానికి అనారోగ్యమే కారణమా?

ఆమె స్పందిస్తూ.. ‘ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో సినిమా చేశాను. తమిళంలో మూడు సినిమాలు చేశాను. హరిహర వీరమల్లు సినిమాకు సైన్ చేశాను. ఆతృతతో సినిమాలు చేయాలని లేదు. ఆలోచించి మంచి సినిమాలు చేయాలని చూస్తున్నాను. నా గురించి నువ్వు అంత టెన్షన్ పడకు. నీ పని చూసుకో బ్రదర్’ అంటూ కౌంటర్ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిధి అగర్వాల్ నుంచి త్వరలోనే హరిహర వీరమల్లు సినిమా రాబోతోంది. దానిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇది పాన్ ఇండియా సినిమాగా వస్తోంది. ఇది హిట్ అయితే నిధికి మళ్లీ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది.

Exit mobile version