మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన 5 రోజులకు గాను రూ. 315 కోట్లు గ్రాస్ కలెక్షస్న్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ నటన, ఎమోషనల్ కనెక్ట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఈ సినిమాలో జాన్వీ కపూర్ సీన్స్ తో పాటు సెకండాఫ్ లో కొన్ని పాత్రల ఎండింగ్ సరిగా లేదని కొద్దీ రోజులుగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చిత్ర బృందం ఈ సినిమాలో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ సినిమా లెంత్, అలాగే కొన్ని సీన్స్ విషయంలో వస్తున్న మిశ్రమ స్పందనను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కొన్ని సీన్లను డిలీట్ చేసి, మరికొన్ని కొత్త సీన్లను జత చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా సెకండాఫ్ లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ పోషించిన ‘గౌరినాయుడు’ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ను కొన్నింటిని తొలగించనున్నారట. ఈ సీన్స్ సినిమా ఫ్లోను కాస్త నెమ్మదించేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ రామ్ చరణ్, జగపతి బాబుల మధ్య ఉండే మరికొన్ని కీలకమైన సీన్లను యాడ్ చేయబోతున్నారట. ఈ మార్పులన్నింటినీ పూర్తి చేసిన తర్వాత చిత్ర యూనిట్ ఈ కొత్త వర్షన్‌ను మళ్లీ సెన్సార్ చేసి థియేటర్లలో పాత వర్షన్ ను తీసేసి, ఈ కొత్త వెర్షన్‌ను అప్‌లోడ్ చేయనున్నారు. ఈ సరికొత్త మార్పులతో ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని టీమ్ భావిస్తోంది.

