Site icon NTV Telugu

Sivam Media: టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ శివమ్‌ మీడియా ప్రారంభం!

Sivam Media Launched

Sivam Media Launched

New Production House Named Sivam Media Launched in tollywood: టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్‌ మీడియా’ పేరుతో ప్రారంభం అయ్యింది. సీనియర్‌ జర్నలిస్ట్‌ శివమల్లాల ఈ బ్యానర్‌కి నిర్మాతగా వ్యవహరించనున్నారు. గురువారం ఈ సినిమా శివమ్‌ మీడియా లోగో అలాగే బ్యానర్‌ను ప్రముఖ నటులు అలీ నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల , అనిల్‌ కడియాల చేతుల మీదుగా బ్యానర్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ శివ నా తమ్ముడు లాంటివాడు, గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుండి కెరీర్‌ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉందన్నారు. అనిల్‌ కడియాల మాట్లాడుతూ– శివమల్లాల తొలి రోజుల్నుంచి మాకు మంచి ఫ్రెండ్, అందుకే మా జర్నీలో శివ ఎప్పుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్‌ మీడియా’ అనే బ్యానర్‌ ద్వారా శివ అనేక సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ చిన్న రిపోర్టర్‌గా పిఆర్వోగా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్‌ని పెట్టింది అనిపిస్తుంది. ‘శివమ్‌ మీడియా’ విషయంలో నేను ఎంతో ప్రౌడ్‌గా ఫీలవుతున్నా, ఈ బ్యానర్‌ద్వారా డబ్బింగ్‌ సినిమానా, స్ట్రెయిట్‌ సినిమానా అనే తేడా లేకుండా అనేక మంచి సినిమాలు వస్తాయని రావాలని కోరుకుంటున్నానన్నారు. శివమ్‌ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ–‘‘ నాకు ఎప్పుడు సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా, ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్‌ని ప్రారంభించటం ఎంతో హ్యాపీ అన్నారు. శివమ్‌ మీడియా బ్యానర్‌పై మంచి సినిమాలు చేస్తాననన్నారు. ఈ సినిమాలో హీరోగా హమరేశ్, హీరోయిన్‌ గా ప్రార్థన సందీప్ నటిస్తున్నారు.

Exit mobile version