Site icon NTV Telugu

Twins as Heros: అప్పుడు రామ్ – లక్ష్మణ్… ఇప్పుడు రామకృష్ణ – హరికృష్ణ!

Twins

Twins

TSR movie makers: కవలలు సినిమాల్లో నటించిన సందర్భాలు, కీలక పాత్రలు పోషించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే కవలలు కలిసి హీరోలుగా నటించడం అనేది చాలా అసాధారణం. అప్పట్లో ఫైటర్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న కొత్తలో రామ్-లక్ష్మణ్‌ హీరోలుగా రెండు మూడు సినిమాలు చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఫైట్ మాస్టర్స్ గా స్థిరపడ్డారు. ఇవాళ వాళ్ళు స్టార్ ఫైట్ కొరియోగ్రాఫర్స్ గా ఎదిగారు! తాజాగా అన్నదమ్ములైన రామకృష్ణ, హరికృష్ణ సైతం హీరోగా నటించబోతున్నారు. వీరితో వారి తండ్రి తిరుపతి శ్రీనివాసరావు ఓ సినిమాను ప్రారంభించబోతున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ ‘టి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్’ లోగోను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ”టాలీవుడ్ లో మా కంటూ ఓ స్థానం ఏర్ప‌రుచుకునేందుకు ఈ సంస్థ‌ను ప్రారంభిస్తున్నాం. త్వరలో షూటింగ్ ను మొదలుపెడతాం. మా పిల్లలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ ఇద్దరినీ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేయబోతున్నాను. ఈ సినిమాకు స్టంట్ మాన్ బద్రీ అన్న సహకరిస్తున్నారు” అని చెప్పారు. బద్రీ మాట్లాడుతూ, ”ఈ కవలలిద్దరూ నటులుగా చక్కని పేరు తెచ్చుకుంటారనే నమ్మకం ఉంది. కష్టపడిన వారికి తప్పకుండా విజయం లభిస్తుంది” అని అన్నారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ‘బస్టాప్’ కోటేశ్వరరావు, ‘మీలో ఒక్కడు’ నిర్మాత కుప్పిలి శ్రీనివాస్, అశోక్ కుమార్, ‘రచ్చ’ రవి, అరుంధతి శ్రీనివాస్ తదితరులు చిత్ర నిర్మాత శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version