NTV Telugu Site icon

Neti Bharatham: ఒకే పాత్ర‌తో ‘నేటి భార‌తం’ సినిమా.. ఆసక్తికరంగా ట్రైలర్

Neti Bharatham Trailer

Neti Bharatham Trailer

Neti Bharatham Trailer Launched: ఒకే పాత్ర‌తో…సామాజిక సందేశంతో రూపొందిన నేటి భార‌తం సినిమాలు భ‌ర‌త్ పారేప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో డా.య‌ర్రా శ్రీధ‌ర్ రాజు న‌టిస్తూ నిర్మించారు. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా న‌టుడు, నిర్మాత డా. య‌ర్రా శ్రీధ‌ర్ రాజు మాట్లాడుతూ…`క‌రోనా త‌ర్వాత వ‌చ్చిన ఆర్థిక‌, సామాజిక స్థితి గ‌తుల‌పై ఈ సినిమా ఉంటుంది, ముఖ్యంగా పాలసీ మేకింగ్ తో పాటు ఆ పాల‌సీల వెన‌కాల రాజ‌కీయ నాయ‌కులు స్వార్థాలు, వాటి అమ‌లు తీరు ఇలా ప‌లు సోష‌ల్ ఇష్యూస్ పై మా ‘నేటి భార‌తం’ సినిమా చేశామని అన్నారు.

Suhani Bhatnagar: 19 ఏళ్లకే ‘దంగల్’ నటి కన్నుమూత.. యాక్సిడెంట్ లో బతికినా, అందుకే చనిపోయింది!

కీర్తి శేషులు పెద్దాడ‌మూర్తి ఈ సినిమాకి అద్భుత‌మైన మాట‌లు, పాట‌లు అందించారని, ఇందులో నేను జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించానని అన్నారు. దీనికి తెర‌వెనుక హీరో ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ పారేప‌ల్లి. త‌న‌తో నేను విద్య‌, వైద్యం మీద మేరాభార‌త్ మ‌హాన్ అనే సినిమా చేశాను. దానికి మంచి పేరొచ్చింది. అందులో నేను మంచి పాత్ర‌లో న‌టించా. ఆ ఇన్ స్పిరేష‌న్ తో ఒకే పాత్ర‌తో నేటి భార‌తం సినిమా చేశాను. ఈ సినిమాలో ఏపీ రాజ‌ధాని ఇష్యూతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి సున్నిత‌మైన అంశాల గురించి కూడా చ‌ర్చించాము. ఏ వ్య‌క్తిని కించ‌ప‌ర‌చ‌కుండా కేవ‌లం పాల‌సీ మేకింగ్ గురించి మాత్ర‌మే మా సినిమాలో చూపించామని, జ‌ర్న‌లిస్ట్ అంకిత‌భావం, తెగింపు మా సినిమాలో చూపిస్తున్నామన్నారు. దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ నేటి భారతం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా, శ్రీధర్ రాజు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు అన్నారు.