NTV Telugu Site icon

Chhello Show: ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన మూవీ ఒటీటీలో వస్తోంది

Chellow Show

Chellow Show

Netflix Releasing Chhellow Show On Nov 25: ఇండియా నుంచి 95వ అకాడెమీ అవార్డులకు ఆర్ఆర్ఆర్ సినిమాని పంపిస్తారని అందరూ అనుకుంటున్న టైంలో.. ‘చెల్లో షో’ (లాస్ట్ ఫిల్మ్ షో) అనే గుజరాతీ సినిమాని ఆస్కార్స్‌కి పంపించడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. అసలు ఈ సినిమాలో ఏముంది? 1200 కోట్లు రాబట్టిన సినిమాని కాదని ఒక చిన్న పిల్లల సినిమాని ఆస్కార్స్‌కి ఎందుకు పంపారు అంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు ‘చెల్లో షో’ (లాస్ట్ ఫిల్మ్ షో) సినిమాలో ఏముంది అనే క్వెషన్‌కి ఎండ్ కార్డ్ పడే సమయం వచ్చింది.

అక్టోబర్ 14న థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ మూవీని నవంబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. గుజరాత్ వరకే థియేటర్స్‌కి పరిమితం అవ్వడంతో, ‘చెల్లో షో’ (లాస్ట్ ఫిల్మ్ షో)ని ఎక్కువమంది చూడలేకపోయారు. ఓటీటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అనే ప్రశ్నకి సమాధానం కోసం ప్రతి సినీ అభిమాని బాహుబలి 2 చూశాడు. ఇప్పుడు ‘ఈ సినిమా కోసం ఆర్ఆర్ఆర్‌ని ఎందుకు ఆపారు’ అనే ప్రశ్నకి సమాధానం కోసం ‘చెల్లో షో’ (లాస్ట్ ఫిల్మ్ షో)ని ఒటీటీలో చూస్తారు.

పాన్ నలిన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ముందుగా 2021లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. 9 ఏళ్ల కుర్రాడు థియేటర్‌లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌కి ఏర్పడ్డ పరిచయంతో థియేటర్‌కి వెళ్లి ప్రొజెక్షన్ గదిలో సినిమాలు వేయడం చూస్తాడు. ప్రొజెక్టర్ నుంచి వెండితెర మీద బొమ్మ పడటం చూసి అతనికి ఆసక్తి కలుగుతుంది. సమ్మర్ మొత్తం అలా ప్రొజెక్షన్ రూంలోనే గడిపేసిన ఆ కుర్రాడు సినిమాల మీద ఆసక్తి పెంచుకుంటాడు. ఆ కుర్రాడి జీవితంలో జరిగిన మార్పులనే లాస్ట్ ఫిల్మ్ షోగా తెరకెక్కించారు. పాన్ నలిన్ ఈ మూవీ చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించారని చాలా రివ్యూస్ వచ్చాయి. లాస్ట్ ఫిల్మ్ షోలో భవిన్ రాబరి, భావేష్ శ్రీమాలి, రిచా మీనా తదితరులు నటించారు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ‘రాహుల్ కోలి’ ఇటివలే లుకేమియా కారణంగా చనిపోయాడు.