Revanth Reddy : హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే, హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే

Netflix India Revanth Reddy

Netflix India Revanth Reddy

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఆఫీస్ ఓపెన్ చేసింది. ఈ ఆఫీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీ సంజయ్ జాజు, నిర్మాత మరియు ప్రస్తుత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, హీరో రానా పాల్గొన్నారు.

Also Read:Vijay: దళపతి విజయ్ కి మరో షాక్!

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఆఫీసు ఓపెన్ చేయడం అభినందనీయమని అన్నారు. నెట్‌ఫ్లిక్స్ టాలెంట్‌ను కలెక్ట్ చేస్తుందని, హైదరాబాద్ టాలెంట్‌ను గ్లోబల్ లెవెల్‌కు పరిచయం చేస్తుందని అన్నారు. హైదరాబాద్ కు పురాతన చరిత్ర ఉందని పేర్కొన్నారు. సినిమాలంటే చిన్నప్పటి నుంచి తనకు ఆసక్తి ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువగా చూస్తుండేవాడినని, బ్లాక్ అండ్ వైట్ నుంచి ఒక్కో విధంగా సినిమా మారుతూ వచ్చిందని అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు వంటి వాళ్ళు హైదరాబాద్ కు సినిమాను తీసుకొచ్చారని.. హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే, హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే అని ఆయన పేర్కొన్నారు.