Site icon NTV Telugu

Mahesh Babu: సూపర్ స్టార్ ని కలిసిన నెట్ ఫ్లిక్స్ సీఈవో…

Mahesh Babu

Mahesh Babu

నెట్ ఫ్లిక్స్ తెలుగు హీరోలని ఎందుకు కలుస్తుంది అనేది తెలియదు కానీ రోజుకో స్టార్ హీరోని కలుస్తూ మీటింగ్ జరుపుతున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ ని కలిసాడు నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లోపు ఎన్టీఆర్ అండ్ దేవరని టీమ్ ని నిన్న కలిసి లంచ్ చేసారు. అలా బ్యాక్ టు బ్యాక్ రెండు రోజుల్లో ఇద్దరు స్టార్ హీరోస్ ని కలిసిన టెడ్ సరండోస్… ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిసాడు. త్రివిక్రమ్, నాగ వంశీలు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. కాఫీ అండ్ చిల్ విత్ కొంచెం సినిమా అనేలా మహేష్ బాబు సోషల్ మీడియాలో టెడ్ సరండోస్ ని కలిసిన ఫోటోని పోస్ట్ చేసాడు. నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ తో పాటు నెట్ క్లిక్స్ ఇండియా హెడ్ మోనికా షేర్గిల్, కంటెంట్ అక్విజిషన్ హెడ్ అభిషేక్ గోరాడియా కూడా మహేష్ బాబుని కలిసాడు.

ఈ మీటింగ్స్ ఎందుకు అనేది తెలియట్లేదు కానీ అభిమానులకి మాత్రం తమ హీరోలని నెట్ ఫ్లిక్స్ సీఈవో వచ్చి కలవడం ఖుషి చేస్తుంది. నెక్స్ట్ టెడ్ సరండోస్ ఎవరిని కాలుస్తాడు అనేది చూడాలి. అయితే గత కొంతకాలంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి స్టార్ హీరోల సినిమాలకి బడ్జట్స్ విషయంలో చర్చ జరుగుతూనే ఉంది. దీని కారణంగా చాలా ప్రాజెక్ట్స్ హోల్డ్ లోకి వెళ్లిపోయాయి. రవితేజ-గోపీచంద్ మలినేని సినిమా అయితే అనౌన్స్ అయ్యి మరీ ఆగిపోయింది. మరీ టెడ్ సరండోస్ ఆ విషయం గురించి మాట్లాడడానికి హైదరాబాద్ వచ్చారా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version