Site icon NTV Telugu

‘నేను లేని నా ప్రేమకథ’ విడుదల తేదీ ఖరారు!

Nenu Leni Naa Prema Katha to release on October 8th

నవీన్ చంద్ర, గాయత్రి సురేశ్ తో పాటు క్రిష్ సిద్ధిపల్లి, అదితి మ్యాకల్ , రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన సినిమా ‘నేను లేని నా ప్రేమకథ’. సురేశ్ ఉత్తరాది దర్శకత్వంలో కళ్యాణ్ కందుకూరి, ఎ. భాస్కరరావు నిర్మించిన ఈ సినిమా యు.ఎఫ్.ఓ. మూవీజ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ”ఇటీవల జెమినీ రికార్డ్స్ (మ్యూజిక్) ద్వారా విడుదలైన ఈ చిత్ర గీతాలు సంగీతాభిమానులను ఇప్పటికే అలరిస్తున్నాయి. వినూత్న కథాంశంలో, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందించాం. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని, అక్టోబర్ 8న విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది” అని అన్నారు. జువెన్ సింగ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి రాంబాబు గోపాల పాటలు రాయగా, సాబిర్ షా సంభాషణలు అందించారు.

Read Also : ఆకట్టుకుంటున్న ‘పుష్ప’రాజ్ లవర్ శ్రీవల్లి లుక్

Exit mobile version