Site icon NTV Telugu

Nenu Keerthana: అమెజాన్లో ఆకట్టుకుంటున్న ‘నేను-కీర్తన’

Keer

Keer

చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఏ) సమర్పణలో, చిమటా లక్ష్మీ కుమారి నిర్మించారు. గత ఏడాది ఆగస్టు 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 99 రూపాయల రెంట్‌తో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రానికి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. తక్కువ సమయంలో మంచి వ్యూస్ రాబట్టుకుందని యూనిట్ చెబుతోంది. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్ ,కామెడీ, హర్రర్ తో పాటు అన్ని ఎలిమెంట్స్‌తో మల్టీ జానర్ మూవీగా చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) ఈ చిత్రాన్ని రూపొందించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ కావడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. జానీ పాత్రలో రమేష్ బాబు నటించిన తీరు అందరినీ ఆకట్టుకుందని టీం చెబుతోంది. రిషిత, మేఘన హీరోయిన్లుగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. రేణు ప్రియా, సంధ్య, జీవా, విజయ్ రంగరాజ్, జబర్ధస్త్ అప్పారావు, జబర్ధస్త్ సన్నీ తదితరలు ఇతర పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రం ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్‌ను సొంతం చేసుకోగా బుక్‌మైషోలో 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

Exit mobile version