Neethone Nenu Pre grand Pre Release Event: ‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా అంజిరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘నీతోనే నేను’. అక్టోబర్ 13న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాను శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మెదక్‌లో ఘనంగా నిర్వహించగా ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ సినిమా నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘‘నీతోనే నేను’ కథను రాయటానికి డిసెంబర్ నుంచి మే వరకు టీమ్‌తో కలిసి డిస్కషన్ చేసుకుంటూ వచ్చాననీ, మే నెలలో కథ పూర్తి కాగానే షూటింగ్‌ను స్టార్ట్ చేశామని అన్నారు.
Murali Sharma Wife: నటుడు మురళీ శర్మ భార్య ఈ నటి అని మీకు తెలుసా? అల్లు అర్జున్ నే వణికించింది!
కేవలం 33 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశామన్న ఆయన సింగిల్ షెడ్యూల్‌లో ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశామని అన్నారు. టీచర్స్ మీద సినిమా చేస్తున్నారేంటి? అని ఈ జర్నీలో నన్ను చాలా మంది అడిగారు నా ఉపాధ్యాయుల మీద, నా కథ మీద, నా టీమ్ మీద, నా మీద నాకు ఉన్న నమ్మకంతో ముందుకు అడుగులు వేస్తూ వచ్చాననీ ఆయన అన్నారు. దర్శకుడు అంజిరామ్ మాట్లాడుతూ ‘‘మెదక్‌లో ‘నీతోనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించటం చాలా ఆనందంగా ఉందనీ, నాలుగు నెలల పాటు ఎంటైర్ టీమ్ కష్టపడినందువల్లే సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయటానికి సిద్ధమయ్యామని అన్నారు.