Site icon NTV Telugu

Nee Daare Nee Katha: దారే నీ కథ .. టైటిలే కాదు టీజర్ కూడా డిఫెరెంటే గురూ!

Nee Dhaarey Nee Katha Official Teaser

Nee Dhaarey Nee Katha Official Teaser

Nee Daare Nee Katha Teaser Released: జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరిస్తూ తేజేష్ వీర, శైలజ సహ నిర్మాతలుగా ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా టైటిల్ ను నీ దారే నీ కథగా ఫిక్స్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చేతుల మీదుగా లంచ్ చేయించారు.

RC 16 Movie : గ్రాండ్ గా ప్రారంభమైన RC16 మూవీ.. వైరల్ అవుతున్న వీడియోలు..

మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో మొత్తం కొత్త వాళ్ళతో ఈ సినిమా యువతను ఆకట్టుకునే విధంగా ఉండబోతోందని టీజర్ కట్ చూస్తే అర్ధం అవుతోంది. నిర్మాత మరియు దర్శకుడు వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ నేను న్యూయార్క్ లో డైరెక్షన్ గురించి చదువుకొని వచ్చా, యూఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ని మన నేటివిటీకి తగినట్టుగా తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించామన్నారు.. ఎంతోమంది సింక్ సౌండ్ రిస్క్ అంటున్న సింక్ సౌండ్ తోనే ఎగ్జిక్యూట్ చేసి హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగ్గకుండా చేశామని ఈ సినిమాతో కథనే ఎంజాయ్ చేయకుండా కథతో పాటు మ్యూజిక్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మ్యూజిక్ డిజైన్ చేయించామని అన్నారు. ఈ సినిమా మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది అని అన్నారు.

Exit mobile version