NTV Telugu Site icon

NC22: చైతన్యను తాకాలంటే ఏ శక్తి సరిపోదు

Nc22 Pre Look

Nc22 Pre Look

NC22 Pre Look Poster Released: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) అనగానే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టొరీ మూవీస్ గుర్తొస్తాయి. కెరియర్ స్టార్టింగ్ నుంచి ప్రేమకథలతో హిట్స్ కొట్టిన చైతన్య, అప్పుడప్పుడూ యాక్షన్ ట్రాక్ ఎక్కాడు కానీ లవ్ స్టొరీ సినిమాల్లో వచ్చినంత పెద్ద హిట్ రాలేదు. చై ఫిజిక్ కి సరైన కమర్షియల్ కథ పడితే ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్న సినిమా ‘NC22’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ బైలింగ్వల్ మూవీ NC22 అనేది వర్కింగ్ టైటిలే మాత్రమే. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న NC 22 నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. నవంబర్ 23న నాగ చైతన్య పుట్టిన రోజు కావడం, ఆరోజు ఉదయం 10:18 నిమిషాలకి NC 22 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ, NC 22 మేకర్స్ ప్రీలుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు(NC22 Pre Look Poster).

‘నో ఫోర్స్ కెన్ హోల్డ్ హిస్ రేజ్’ అంటూ రిలీజ్ చేసిన ప్రీలుక్ పోస్టర్ లో ‘చై’ కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉండగా, అతన్ని చాలా మంది పోలీసులు పట్టుకున్నారు. చైతన్యని పోలీసులు ఎందుకు పట్టుకున్నారో తెలియదు కానీ చైతన్య కూడా పోలిస్ యూనిఫార్మ్ లోనే ఉండడం విశేషం. ‘మానాడు’ సినిమాతో మైండ్ గేమ్ ఆడిన వెంకట్ ప్రభు, మరోసారి అలాంటి థ్రిల్లర్ నే ప్లాన్ చేసినట్లు ఉన్నాడు. NC 22 ప్రీలుక్ పోస్టర్ లో ఇంకో విశేషం ఉంది, నాగ చైతన్య వేసుకున్న పోలిస్ యూనిఫార్మ్ నేమ్ బాడ్జ్ పైన ‘ఏ.శివ’ అనే పేరుంది అంటే ఈ థ్రిల్లర్ మూవీలో చై ‘శివ’ అనే రోల్ ప్లే చేస్తున్నట్లు ఉన్నాడు. శివ అనే పేరు పెట్టుకోని కింగ్ నాగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. మరి ఈసారి చై ఆ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.