NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ

Nbk 111

Nbk 111

‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో 111వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ముంబయి నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ భారీ కమర్షియల్ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ రోల్‌ కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో మంచు మనోజ్ బాలకృష్ణను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నాడు. కాగా నేడు నటసింహం పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పూనకాలు తెప్పించే అప్‌డేట్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా ఎదురుచూపులకు సమయం ముగిసింది. బాలయ్య సృష్టించబోయే ఇంపాక్ట్‌కు మాత్రం ఈసారి ఎలాంటి హద్దులు లేవు. బాలయ్య బాబు 111వ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ ను ఈరోజు సాయంత్రం 5:40 గంటలకు విడుదల చేయబోతున్నారు. “ఒక సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది.. మునుపెన్నడూ చూడని విధంగా సెలబ్రేషన్స్ ఉండేలా గేర్ అప్ అవ్వండి” అంటూ చిత్ర యూనిట్ అభిమానుల్లో అంచనాలను  పెంచేసింది. బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో రాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గోపీచంద్ మలినేని ఎలివేషన్స్ తోడైతే ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పక్కా అని చెప్పొచ్చు.

×
×
Ad