NTV Telugu Site icon

NBK 108: బాలయ్య-అనిల్ మంచి జోష్ లో ఉన్నారే…

Nbk 108

Nbk 108

సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ బరిలో నిలిచి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నట సింహం నందమూరి బాలకృష్ణ. ఈ దసరాకి మరొకసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ బాలయ్య తన కొత్త సినిమాని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీలా మరో స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీపై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. అటు అనిల్ రావిపూడి ఫన్ టైమింగ్, ఇటు బాలయ్య మార్క్ మాస్… రెండు ఎలిమెంట్స్ ఉండేలా రూపొందుతున్న NBK 108 సినిమాని దసరాకి రిలీజ్ చేస్తున్నాం అని మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఈ విజయదశమికి ఆయుధ పూజ అంటూ షైన్ స్కీన్ ప్రొడ్యూసర్స్ బాలయ్య ఉన్న పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా NBK 108 మూవీకి సంబంధించిన ఒక పాట షూటింగ్ ని కంప్లీట్ చేసామని చిత్ర యూనిట్ తెలిపారు.

గ్రాండ్ సెట్ లో, హై ఎనర్జీ సాంగ్ ని షూట్ చేశారు. శేఖర్ మాస్టర్ ఖోరియోగ్రఫి చేసిన ఈ సాంగ్ షూటింగ్ ని చిత్ర యూనిట్ సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఈ సాంగ్ ని చూసి ఆడియన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేస్తారని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మాములుగా స్టార్ హీరో సినిమా షూటింగ్ అంటే లీకులు బయటకి వస్తాయి, అనుకున్న షెడ్యూల్ లో డిలే ఉంటుంది. ఈ విషయాలు తమ సినిమాని వర్తించవు అన్నట్లు బాలయ్య-అనిల్ రావిపూడి NBK 108 షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలాంటి లీకులు లేకుండా, సైలెంట్ గా షూటింగ్ చేసేసి NBK 108 సినిమా షూటింగ్ ని పూర్తి చేసి దసరాకి బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి ఈ రేర్ కాంబో ఎలాంటి రిజల్ట్ ని రాబడుతుందో చూడాలి.