సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతార మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా తన అభిమానులను అలరించబోతోందట. ఇటీవల షూటింగ్ ప్రారంభించిన షారుఖ్ ఖాన్ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది నయన్. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా “లయన్” అనే టైటిల్ పెట్టారు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార ఇన్వెస్టిగేటివ్ పోలీస్ పాత్రలో నటించనుందని టాక్. ఆ పాత్రకు నయనతారనే మొదట ఎంపిక చేసుకున్నారు. నయనతార ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లుగా వస్తున్న ఊహాగానాలు అవాస్తవమని తెలుస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో షారుఖ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘లయన్’లో ప్రియమణి, సన్యా మల్హోత్రా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. షారుఖ్ హోమ్ బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై ఈ మూవీ రూపొందుతోంది. షారూఖ్ ఖాన్ తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన తర్వాత సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. షారుఖ్ ఖాన్ డిసెంబర్ నుండి ‘లయన్’ సెట్స్‌కి తిరిగి వస్తారని భావిస్తున్నారు. దానికి అనుగుణంగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Also : చిక్కుల్లో పడబోతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్
