Site icon NTV Telugu

Nayanthara: భర్తతో నయన్ విడాకుల రూమర్స్.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చిన విఘ్నేష్..

Nayanthara And Vignesh Shivan

Nayanthara And Vignesh Shivan

కోలివుడ్ స్టార్ హీరోయిన్ నయన తార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్,కోలివుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే.. తమిళ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్‌ హీరోయిన్‌ నయనతార భర్తను అన్ ఫాలో చేసిందని రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి.. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ విఘ్నేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది..

నయనతార స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటు వరుస సినిమాల్లో బిజీగా ఉంటుంది…ఎంత స్టార్డమ్ వచ్చినా.. నయనతార మాత్రం సోషల్ మీడియాకు దూరంగానే ఉండేది. కానీ కొన్నిరోజుల కిత్రం తాను కూడా ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టింది. ఇక ఇటీవల నయనతార ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ లిస్ట్లో విఘ్నేష్ శివన్ పేరు కనిపించలేదు. దీంతో నయన్.. విఘ్నేష్ను అన్ఫాలో చేసిందని వార్తలు మొదలయ్యాయి. అంతే కాకుండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వింత కోట్ను కూడా షేర్ చేసింది.. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి.. ఈ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా విఘ్నేశ్ శివన్ ఒక పోస్ట్ చేశాడు..

నయనతార కొన్నిరోజుల క్రితం ఒక స్కిన్ కేర్ బ్రాండ్ను ప్రారంభించింది. తాజాగా ఆ బ్రాండ్కు ఒక అవార్డ్ దక్కిందని విఘ్నేష్ శివన్.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. నయనతార ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చిన్న టెక్నికల్ సమస్య వల్లే విఘ్నేష్ పేరు ఫాలోయింగ్ లిస్ట్లో కనిపించలేదని సన్నిహితులు చెప్తున్నారు.. దాంతో రూమర్స్ మొదలయ్యాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇద్దరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు..

Exit mobile version