Site icon NTV Telugu

సత్యదేవ్ కి జోడీగా నయన్

Satydev role in Chiranjeevi film revealed

సత్యదేవ్ కెరీర్ మంచి జోరుమీదుంది. కరోనా టైమ్ లో పూర్తి స్థాయిలో లాభపడిన హీరో ఎవరంటే ఖచ్చితంగా సత్యదేవ్ పేరే వినపడుతుంది. ఇటీవల ‘తిమ్మరుసు’తో మరోసారి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న సత్యదేవ్ ప్రస్తుతం ‘గుర్తుందా సీతాకాలం, గాడ్సే’ వంటి తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లో ‘రామ్ సేతు, స్కైలాబ్’ సినిమాలు చేస్తున్నాడు. వీటన్నింటికి మించి చిరంజీవి నటిస్తున్న ‘లూసిఫర్’ రీమేక్ లో సత్యదేవ్ విలన్ గా కనిపించబోతుండటం అతని కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.

Read Also : నిర్మాతగా మారిన ఇంద్రగంటి

మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ను తెలుగులో మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులోనే సత్యదేవ్ ప్రతినాయకుడుగా కనిపించబోతున్నాడు. ఇక ఆయనకు జోడీగా దక్షిణాది సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతోందట. నయన్ ఇందులో చిరంజీవికి చెల్లెలుగా, సత్యదేవ్ కి భార్యగా కనిపించనుంది. చిరుకు విలన్ అంటేనే పెద్ద న్యూస్ అనుకుంటుంటే ఇక నయన్ జతగా నటించనుండటం సత్యదేవ్ అదృష్టమనే చెప్పాలి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తాడని వినిపించినా… అది నిజం కాదని తేలింది. ఆ పాత్రలో మరో స్టార్ హీరో కనిపిస్తాడని సమాచారం. ఒరిజినల్ లో వివేక్ ఓబరాయ్ పోషించిన పాత్రనే సత్యదేవ్ చేస్తున్నాడు. సో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సత్యదేవ్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనే చెప్పాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ…

Exit mobile version