NTV Telugu Site icon

Nawazuddin Siddiqui: అంత రచ్చ చేసి విడాకులన్నారు.. ఇప్పుడు మళ్ళీ లవ్వేంటి బాసూ?

Aaliya Siddiqui Shared Post For Nawazuddin Siddiqui

Aaliya Siddiqui Shared Post For Nawazuddin Siddiqui

Aaliya Siddiqui Shared Post For Nawazuddin Siddiqui On Their 14th Wedding Anniversary : హిందీ ‘బిగ్ బాస్ OTT 2’ కంటెస్టెంట్, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ మాజీ భార్య అలియా సిద్ధిఖీ మరో సారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి అలియా సిద్ధిఖీ సోషల్ మీడియా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అలియా చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతోంది. నిజానికి గత కొన్నేళ్లుగా నవాజుద్దీన్ సిద్ధిఖీపై అలియా పలు ఆరోపణలు చేస్తోంది. అయితే నిన్న అందుకు భిన్నంగా అలియా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా నవాజుద్దీన్ సిద్ధిఖీపై ప్రేమను కురిపించింది. ఆమె నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి ఉన్న అనేక ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. నిజానికి నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని భార్య మధ్య ఉన్న మనస్పర్థలు గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.

Niharika: టార్గెట్ ‘కుర్రోళ్లే’.. నిహారిక సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

ఎందుకంటే ఇద్దరూ సోషల్ మీడియాలో బహిరంగంగానే పోట్లాడుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి, విషయం కోర్టు వరకు వెళ్లింది. ఓ వైపు అలియా విడాకుల కేసు పెట్టి తన పిల్లలతో విడిగా జీవించడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఆలియా షేర్ చేసిన పోస్ట్‌ ను బట్టి చూస్తుంటే అలియా, నవాజుద్దీన్ సిద్దిఖీల మధ్య ప్యాచ్ అప్ అయినట్లు కనిపిస్తోంది. అలియా పెట్టిన పోస్టులో నవాజుద్దీన్ సిద్ధిఖీతో తన 14వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పింది. దాన్ని పోస్ట్ చేస్తూ, ఆలియా క్యాప్షన్‌లో ‘నేను నా ఏకైక భాగస్వామితో 14 సంవత్సరాల సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్నందుకు వేడుకలు జరుపుకుంటున్నాను, వార్షికోత్సవ శుభాకాంక్షలు అని రాసుకొచ్చింది. నిజానికి ‘బిగ్ బాస్ OTT 2’లో అలియా ఎక్కువ రోజులు ఈమె లేదు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తన కొత్త భాగస్వామితో అంటే బాయ్‌ఫ్రెండ్‌తో చాలా ఫోటోలను పోస్ట్ చేసింది. తాను జీవితంలో ముందుకు సాగుతున్నానని కూడా చెప్పింది. ప్రస్తుతం, అలియా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న అన్ని ఫొటోలను తొలగించింది. అయితే, అలియా పోస్ట్‌పై నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇంకా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.