Site icon NTV Telugu

Nawazuddin Siddique: రొమాన్స్‌కి వయసుతో సంబంధం లేదు.. అన్నీ అందులోనే!

Nawazuddin

Nawazuddin

Nawazuddin Siddique Gives Strong Counter To Trollers: ప్రేమకి వయసుతో సంబంధం లేదని అమర ప్రేమికులు సూక్తులు చెప్పినట్టు.. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా లేటెస్ట్‌గా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. రొమాన్స్‌కు వయసుతో ఏమాత్రం సంబంధం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. అతడు ఈ డైలాగ్ కొట్టడానికి కారణం.. 50 ఏళ్ల వయసున్న నవాజ్, 21 ఏళ్ల అమ్మాయికి లిప్‌లాక్ పెట్టడమే! లేటెస్ట్‌గా ఈ నటుడు 21 ఏళ్లున్న అవినీత్ కౌర్‌తో కలిసి ‘టికు వెడ్స్ షేరు’ సినిమాలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో వీళిద్దరు లిప్‌లాక్ చేసుకునే సీన్ ఉంది. అయితే.. ఈ సీన్‌పై నెటిజన్ల నుంచి విమర్శలొచ్చాయి. సుమారు 29 ఏళ్ల వయసు వ్యత్యాసమున్న అవినీత్‌తో ముద్దు సీన్లలో నటించడమేంటి? అంటూ జనాలు ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.

Samsung Galaxy F54 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఆఫర్స్ డీటెయిల్స్ ఇవే!

దీనిపై నవాజుద్దీన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నవాజ్ మాట్లాడుతూ.. ‘‘హీరో, హీరోయిన్లకి ఏజ్ గ్యాప్ అనేది సమస్య కాదు. అసలు రొమాన్స్‌కు వయసుతో సంబంధం లేదు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్‌ రోల్స్‌ చేస్తున్నాడు. ఎందుకంటే.. ప్రస్తుతమున్న యువ హీరోలు అందుకు పనికిరారు కాబట్టి. ఇప్పుడు ఈ సీన్ చూసి ట్రోల్స్ చేస్తున్న వారు కూడా.. తమకు రొమాన్స్ గురించి తెలియదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుత తరంలో లవ్, బ్రేకప్ అన్నీ వాట్సాప్‌లోనే జరుగుతున్నాయి. అయితే.. జీవితంలో ఎవరైతే రొమాన్స్ చేస్తారో, వాళ్లు మాత్రమే ఇలాంటి సీన్స్ చేయగలరు’’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే.. ఎవరైతే ఈ సీన్‌పై కామెంట్లు చేశారో, వాళ్లకు రొమాన్స్ చేయడం చేతకాదని పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడన్నమాట!

Anil Ravipudi : బాలయ్య తర్వాత నెక్స్ట్ సినిమా ఏ హీరోతో తీస్తున్నారో తెలుసా?

కాగా.. టికు వెడ్స్ షేరు సినిమా నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 23వ విడుదల కానుంది. ఈ సినిమాను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించింది. ఈ సినిమాతో పాటు నవాజుద్దీన్ ప్రస్తుతం వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న సైంధవ్‌లో విలన్‌గా నటిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వికాస్‌ మాలిక్‌గా ఆయన కనిపించనున్నారు.

Exit mobile version