మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నవ్య నాయర్ , తాజాగా ఆస్ట్రేలియాలో ఓ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో లగేజ్ చెక్‌లు, సెక్యూరిటీ స్కానింగ్ జరుగుతుంటాయి. కానీ, తన దగ్గర మల్లెపూలు ఉండటంతో ఆస్ట్రేలియా అధికారులు ఆమెకు భారీ జరిమానా విధించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Also Read : Boney Kapoor : శ్రీదేవి నన్ను గదిలోకి అనుమతించలేదు .. బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్
ప్రతి మలయాళీకి ఓనం పండుగ ఒక పెద్ద సంబరంగా జరుపుకుంటారు. కేరళలో మాత్రమే కాకుండా, విదేశాలలో కూడా అక్కడి అసోసియేషన్లు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఆస్ట్రేలియాలోని (Malayali Association of Victoria) నిర్వహించిన ఓనం వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యేందుకు నవ్య నాయర్ మెల్‌బోర్న్ వెళ్లారు. ఈ వేడుకలో పాల్గొని, మలయాళం కమ్యూనిటీ తో కలసి ఓనం ఆనందాన్ని పంచుకోవాలనుకున్నారు. కానీ మెల్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
తన హ్యాండ్ బ్యాగ్‌లో మల్లెపూలు ఉండటం గమనించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే ఆపి విచారణ చేపట్టారు. అక్కడి నిబంధనల ప్రకారం, కొన్ని రకాల పూలు, విత్తనాలు, పండ్లు లేదా పంట ఉత్పత్తులను ఇతర దేశాల నుంచి తీసుకురావడం కఠినంగా నిషేధించబడింది. ఈ నిబంధనను ఉల్లంఘించిందనే కారణంగా నవ్య నాయర్‌పై ఏకంగా రూ.1.14 లక్షల (2000 ఆస్ట్రేలియన్ డాలర్లు) జరిమానా విధించారు. అంతేకాకుండా, ఆ ఫైన్‌ను 28 రోజుల్లోపు చెల్లించాలని కూడా హెచ్చరించారు. ఈ విషయాన్ని స్వయంగా నవ్య నాయర్ అక్కడ జరిగిన బహిరంగ కార్యక్రమంలో వెల్లడించారు.
ఈ ఘటనపై స్పందించిన నవ్య – “ఆస్ట్రేలియా వెళ్ళే ముందు, నా కోసం నా నాన్నగారు మల్లెపూలు తెచ్చారు. వాటిలో కొన్నింటిని తలలో పెట్టుకున్నాను. మిగిలిన పూలను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకున్నాను. కానీ అక్కడ అలాంటి చట్టం ఉందని తెలియకపోయాను. నేను చేసింది తప్పు అనేది నిజమే. కానీ ఇది పూర్తిగా అనుకోకుండా జరిగింది” అని చెప్పారు.
