టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తగ్గేదే లే’. ఇప్పటికే ‘తగ్గేదే లే’ సినిమా నుంచి నైనా గంగూలీ డాన్స్ చేసిన టైటిల్ సాంగ్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్ అయ్యింది. ‘దండుపాల్యం’ సినిమాని తెరకెక్కించిన శ్రీనివాస్ రాజు డైరెక్ట్ చేసిన ‘తగ్గేదే లే’ సినిమాలో ‘దివ్య పిళ్ళై’, ‘అనన్య రాజ్’ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ రాజు సినిమా అంటేనే థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి వాటికీ తగ్గట్లే ఈ సినిమా ఎక్కడ తగ్గకుండా ఉంటుందని ఇప్పటికే ‘తగ్గేదే లే’ ట్రైలర్ ప్రూవ్ చేసింది. మర్డర్ మిస్టరీకి, దండుపాల్యం గ్యాంగ్ కూడా కలవడంతో ‘తగ్గేదే లే’ సినిమాలో ఇంట్రెస్ట్ పెరిగేలా ఉంది. రోమాన్స్, యాక్షన్స్, సస్పెన్స్ లాంటి ఎలిమెంట్స్ తో సినీ అభిమానులని ఆకట్టుకునేలా రూపొందిన ‘తగ్గేదే లే’ సినిమాలో ‘రవిశంకర్’ పోలిస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ ని కంప్లీట్ చేసుకోని ఒటీటీలో రిలీజ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ థ్రిల్లర్ స్ట్రీమ్ అవుతోంది. ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూడాలి అనుకున్న వాళ్లు అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసి ‘తగ్గేదే లే’ సినిమా చూసేయండి.
Thagghede Le: అమెజాన్ ప్రైమ్ లో ‘యాక్షన్ ఎంటర్టైనర్’
![Taggede Le](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2022/12/taggede-le.jpg)
Taggede Le