NTV Telugu Site icon

Naveen Chandra: లవర్స్ డే.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన హీరో

Naveen

Naveen

Naveen Chandra: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న నవీన్ ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసి మెప్పించాడు. ఇక హీరోనే కాకుండా నటుడిగా కూడా అభిమానులను ఆకట్టుకున్నాడు. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో అలరిస్తున్నాడు. గతేడాది నవీన్ చంద్ర.. తన భార్య ఓర్మాను అభిమానులకు పరిచయం చేశాడు. తాను వచ్చాకా జీవితంలో కొత్త వెలుగు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇక నవీన్ పెళ్లి తరువాత వచ్చిన మొదటి ప్రేమికుల దినోత్సవం కావడంతో ఓర్మాకు మంచి గిఫ్ట్ ఇస్తాడేమో అనుకుంటే.. ఆమె తనకు పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్లు నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు. లవర్స్ డే రోజున నవీన్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలిపాడు.

Renu Desai: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పవన్ మాజీ భార్య

త్వరలోనే తామిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నట్లు నవీన్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. ఓర్మా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంది. బేబీ బంప్ తో ఉన్న ఆమెతో కలిసి బీచ్ లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. “బేబీ మూన్.. నిన్ను నా చేతుల్లో ఎత్తుకోవడానికి ఆగలేకపోతున్నాను. ముందుగానే తండ్రి బాధ్యతలను తీసుకోవడానికి ఆతృత పడుతున్నాను. కొత్త దశ.. కొత్త జీవితం.. కొత్త ప్రయాణం.. తండ్రి కాబోతున్నాను.. లవ్ యూ ఓర్మా.. 2023 కు స్వాగతం” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు నవీన్ చంద్రకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు.