నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘దసరా’ షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ ని సాధించాలని ప్లాన్ చేస్తున్న నాని, తన ఎన్క్ష్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటివరకూ 29 సినిమాల్లో నటించిన నాని, తన 30వ సినిమాని కొత్త ప్రొడ్యూసర్స్ తో చేస్తున్నాడు. ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ నాని 30వ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ… నాని నెక్స్ట్ సినిమా గురించిన ఇతర వివరాలని కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న సాయంత్రం 4:05 నిమిషాలకి తెలియజేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తో నాని నెక్స్ట్ మూవీ దర్శకుడు ఎవరు? నాని పక్కన నటించబోయే హీరోయిన్ ఎవరు అనే డిస్కషన్ స్టార్ట్ అయిపొయింది. ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే జనవరి 1 వరకూ ఆగాల్సిందే.
We are Proudly Embarking on a new journey in Telugu Cinema with Natural 🌟@NameisNani’s next ❤️
Unveiling the world of #NaniNext On 𝑱𝒂𝒏 𝟏𝐬𝐭 𝟐𝟎𝟐𝟑 at 𝟰:𝟬𝟱 𝗣𝗠 🤩
Stay Tuned!@VyraEnts @mohan8998 @drteegala9 #MurthyKalagara pic.twitter.com/Q9vgk2htNx
— Vyra Entertainments (@VyraEnts) December 30, 2022
Read Also: NTR 30: హీరోయిన్ ఫిక్స్, మేజర్ ఆర్టిస్టులు ఫిక్స్…?
