NTV Telugu Site icon

Nani: సూపర్ స్టార్ తో నేచురల్ స్టార్?

Nani

Nani

సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో కలిసి న్యాచురల్ స్టార్ నాని నటించబోతున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. చివరగా దసరా మూవీతో మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్న నాని… ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్‌ ఓ రేంజ్‌లో ఉంది. నానిక జెర్సీ లాంటి డీసెంట్ హిట్ పక్కా అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాట్టు తెలుస్తోంది. అలాగే దసరా డైరెక్టర్‌తో మరో ‘రా’ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడు.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నాని నటించబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు రజనీకాంత్‌తో నటించే ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు.

తలైవాతో నటించడమంటే యంగ్ హీరోలకు ఒక డ్రీమ్, నానికి మాత్రం బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. సూర్య నటించిన జై భీమ్ మూవీ ఎంత సెన్సేషన్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను డైరెక్టర్ టీజే జ్ఞాన‌వేల్‌ తెరకెక్కించాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు ర‌జ‌నీకాంత్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంది. ఈ మూవీలోనే ఓ స్పెషల్ రోల్ కోసం నానిని సంప్రదించగా… ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కాదు, కోలీవుడ్‌లో మరో ప్రాజెక్ట్ కూడా నాని లిస్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో తమిళ్‌లో కూడా నాని బిజీ కానున్నాడనే అని చెప్పాలి. ఏదేమైనా.. ఎలాంటి బ్యాగ్రౌండ్, సపోర్ట్ లేకుండా ఎదిగిన నాని… ఏకంగా సూపర్ స్టార్‌తో ఛాన్స్ అందుకోవడం అంటే గ్రేట్ అనే చెప్పాలి.

Show comments