NTV Telugu Site icon

Nani: అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘సరిపోదా శనివారం’ క్లైమాక్స్

Saripodha Sanivaram

Saripodha Sanivaram

Natural Star Nani Saripodhaa Sanivaaram Huge Climax Shoot In Aluminium Factory: నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఒక ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్‌ రష్ తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్‌పై భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Jyothi Lakshmi: జ్యోతిలక్ష్మి డ్యాన్సరే కాదు.. హీరోయిన్ కూడా.. ఎన్ని సినిమాల్లో చేసిందో తెలుసా?

తాజాగా ఈ సినిమా యూనిట్ క్లైమాక్స్‌ షూటింగ్‌ ప్రారంభించింది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హ్యుజ్ సెట్‌ను నిర్మించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డివోపీగా పని చేస్తున్న ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Show comments