NTV Telugu Site icon

Dasara: మార్చ్ 30న ధూమ్ ధామ్ చేద్దాం…

Dasara

Dasara

పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టొరీ సినిమాలు చేసి హిట్స్ హీరో నాని. ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి టోటల్ ఇండియా తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ తో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ‘దోస్తాన్’ సాంగ్ రిలీజ్ అయ్యి సూపెర్ హిట్ అయ్యింది. ఈ పాట తర్వాత దసరా సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ బయటకి రాలేదు. ఇకపై మాత్రం ఆ గ్యాప్ ని ఫైల్ చేస్తూ ఫ్రీక్వెంట్ గా దసరా అప్డేట్స్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది.

దసరా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగానే ప్రమోషన్స్ ని మొదలుపెట్టాడానికి రెడీ అయిన చిత్ర యూనిట్, ఇకపై బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వస్తుంది అని చెప్పారు. చెప్పినట్లుగానే సంక్రాంతి పండగకి ఒక అప్డేట్ ఇచ్చేశారు. ధరణి, వెన్నెల, సూరిలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు అంటూ మేకర్స్ ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. దసరా సినిమా థీమ్ కి తగ్గట్లే పోస్టర్ కూడా రా అండ్ రస్టిక్ గా ఉంది. ఆర్టిస్టులు కూడా డీగ్లామర్ లుక్ లో కనిపించారు. ఇక్కడి నుంచి మార్చ్ 30 వరకూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ ఇవ్వనున్నారు. సింగరేణి నేపధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగానే ప్రమోషన్స్ కి స్టార్ట్ చేస్తే, రిలీజ్ అయ్యే టైం దసరా మూవీపై అంచనాలు భారీగా ఉంటాయి. పాన్ ఇండియా సినిమా కాబట్టి పాన్ ఇండియా రేంజులోనే ప్రమోషన్స్ చెయ్యాలి, అప్పుడే ఆ మూవీకి అంత రీచ్ వస్తుంది. మరి నాని దేశ పర్యటన ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.